Tuesday, 28 July 2026 04:11:07 AM

భరోసా ఆధ్వర్యంలో పుట్టినరోజు కానుకగా గొడుగు బహుకరణ...

Date : 17 April 2025 08:32 PM Views : 510

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని విట్టల్ నగర్ పార్కు సమీపంలో ఉండే నిరుపేద రజకునికి నల్లి ప్రసాద్ కుమార్ జన్మదినo సందర్భంగా భరోసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు నసీమా ఆధ్వర్యంలో గురువారం గొడుగును బహుకరించారు. ఎటువంటి నీడ లేనటువంటి రజకునికి ఈ గొడుగును ఇవ్వడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఉందని, గొడుగు వల్ల మరి కొంతసేపు తాను పనిచేసుకుంటానని రజకుడు భావోద్వేగానికి గురయ్యాడు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త బొల్లం మధుబాబు, పైడిపల్లి దీపక్ కుమార్, ఎండి హాకీమ్, 12వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు కుంట సది పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :