Tuesday, 28 July 2026 11:12:12 AM

కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ వెంటనే అప్డేట్ చేయాలని సీఐటియు డిమాండ్

Date : 20 September 2025 03:35 PM Views : 308

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని పట్టణంలో శనివారం జరిగిన ఒక ముఖ్య పరిణామంలో, సీఐటియు అనుబంధ సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం నేతలు కాంట్రాక్టు కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా సీఎంపిఎఫ్ రీజనల్ కమిషనర్‌లకు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.మధు, రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గోదావరిఖని రీజనల్ సీఎంపిఎఫ్ కార్యాలయాన్ని సందర్శించి రీజనల్ కమిషనర్-1, కమిషనర్-2 లను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బెల్లంపల్లి, మందమర్రి, శ్రీరాంపూర్, రామగుండం-1, 2, 3, భూపాలపల్లి ఏరియాల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ ఖాతాలను 2022–23 ఆర్థిక సంవత్సరంనుంచి ఇప్పటివరకు అప్డేట్ చేయలేదని, అలాగే పాస్ పుస్తకాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నిర్లక్ష్యం కారణంగా వేలాది మంది కార్మికులు అపోహలు, అనుమానాలతో తీవ్ర ఆందోళన చెందుతున్నారని నాయకులు స్పష్టం చేశారు. వెంటనే సీఎంపిఎఫ్‌ను అప్డేట్ చేసి, పాస్ పుస్తకాలు కార్మికులకు అందజేయాలని వారు డిమాండ్ చేశారు.అదే సమయంలో రీజనల్ కమిషనర్‌లు సానుకూలంగా స్పందించారు. తక్షణ చర్యలు తీసుకొని కాంట్రాక్టు కార్మికుల సీఎంపిఎఫ్ ఖాతాలను అప్డేట్ చేసి, పాస్ పుస్తకాలను త్వరలో అందజేస్తామని వారు హామీ ఇచ్చారు.దీంతో కాంట్రాక్టు కార్మికుల్లో కొంత ఊరట నెలకొంది.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :