ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : అగ్నివీర్, ఆర్మీ సెలక్షన్స్ ఉచితంగా ట్రైనింగ్ కోసం యువత యువకులు దరఖాస్తు చేసుకోవాలని గోదావరిఖని ఒకటవ పట్టణ సీఐ ఇంద్రసేనారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ...వన్ టౌన్ హెడ్ కానిస్టేబుల్ బొజ్జ సురేందర్ ను అగ్నివిర్, ఆర్మీ సెలక్షన్స్, దరఖాస్తుల సేకరణ కోసం నియమించామని ఈ శిక్షణలో ప్రతి యువకులకు ఉచితంగా భోజన సౌకర్యంతో పాటు అన్ని రకాల సౌకర్యాలను అందించనున్నట్లు పేర్కొన్నారు. ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలు కలిగిన యువతీ యువకులు నేరుగా పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Reporter
Aakanksha News