ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : అంబేద్కర్ జీవితం సామాజిక న్యాయానికి ప్రత్యేకగా నిలుస్తుందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కమాన్ పూర్ మండలంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...అంబేద్కర్ భావజాలం ఆధారంగా నూతన భారత నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్షించారు.సామాన్యులకు విద్య, ఉపాధి అవకాశాల్లో న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల సమస్యలను నేరుగా విని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష జరిపారు.గ్రామీణ యువత కోసం నైపుణ్యాభివృద్ధి కేంద్రాల ఏర్పాటు ప్రతిపాదించారు.రహదారి అభివృద్ధికి త్వరలో నిధులు మంజూరవుతాయని తెలిపారు.విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వేయించిన బోర్లు, కాక గారు చేసిన సేవలను గుర్తు చేశారు.ఈ సందర్భంగా గ్రామ అభివృద్ధికి తోడ్పడుతున్న పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు
Admin
Aakanksha News