ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : గ్రూప్–2లో విజయాన్ని సాధించిన యువకుడు దేవసాని వెంకటేష్‌ను అభినందిస్తూ జూలపల్లి గ్రామంలో ఘన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ ప్రత్యేకంగా హాజరై వెంకటేష్‌తో పాటు ఆయన తల్లి దేవసాని లక్ష్మిని సత్కరించారు.అనంతరం రఘువీర్ సింగ్ మాట్లాడుతూ… “వెంకటేష్ ఎంతో కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ద్వారా జూలపల్లి గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ విజయం వెనుక ఆయన తల్లి కృషి అత్యంత ముఖ్యమైందని ఆమె త్యాగం, శ్రమ ఫలితంగానే ఈ రోజు వారి కుటుంబం గర్వించదగ్గ స్థాయికి చేరుకుందని పేర్కొన్నారు.ఈ సందర్భంగా దేవసాని లక్ష్మిని శాలువాతో సత్కరించగా, గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు పొలగాని సతీష్, కోడూరు మహేష్, మేర శ్రీనివాస్, నాడెం శ్రీధర్, బండి రాజిరెడ్డి, సాంబారి ఆంజనేయులు, మల్లెత్తుల కనుకయ్య, దీకొండ ఆంజనేయులు, సిరిపురం సత్యం, జంగం మహేష్, అమరగాని శ్రీను, అమరగాని శ్రీకాంత్, వేంసాని కొంరయ్య, ధరణి శ్రీను, కోడూరు ఆంజనేయులు, శ్రీనివాస్, రాజశేఖర్, కోడూరు సత్యం తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News