Wednesday, 29 July 2026 10:05:29 AM

అత్యవసర సేవలకు అంబులెన్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలి...

జీడీకే 11 ఇంక్లైన్ గని మేనేజర్ కు వినతి

Date : 05 May 2025 11:59 AM Views : 622

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : జీడీకే 11 ఇంక్లైన్ గని పై తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) ఫిట్ సెక్రటరీ వాసర్ల జోసెఫ్ ఆధ్వర్యంలో 24 గంటలు అత్యవసర సేవలకు అంబులెన్స్ ను వెంటనే ఏర్పాటు చేయాలని గని మేనేజర్ కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ... ఏదైనా అత్యవసర సమయంలో కానీ కార్మికులు అస్వస్థతకు గురైన సమయంలో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్న సందర్భంగా కార్మికుల ఆరోగ్య విషయాన్ని దృష్టిలో ఉంచుకొని గనిపై అంబులెన్స్ ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. అలాగే కార్మికులకు సమయానికి చికిత్స అందలేక ఎన్నో రకాల ఇబ్బందులకు గురవుతున్నారని పేర్కొన్నారు. దీంతో పాటు ఎండలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయని రోజురోజుకు మండిపోతున్నా యని దీనివల్ల కార్మికులు ఎన్నో అవస్థలు పడుతున్నారని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మోదంపల్లి రాజేశం పల్లె సురేందర్ చంద్రు శ్రీనివాస్ అంబటి శ్రీనివాస్ ఆకారపు వంశీ మీనుగు సురేష్ మాదాసు శ్రావణ్ కోటిలింగం మహేష్ తో పాటు కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :