Tuesday, 28 July 2026 09:47:26 AM

తుపాకిని వీడి లొంగిపోవాల్సిందే... జనజీవన స్రవంతిలో కలవాల్సిందే... కాంగ్రెస్ పార్టీ టైంపాస్ పార్టీ...

తుపాకిని చేతపట్టి అమాయకులను చంపుతుంటే చేర్చలేంది... బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Date : 05 May 2025 06:23 PM Views : 683

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మావోయిస్టులు తుపాకిని వీడి లొంగి పోవాల్సిందే... జనజీవన స్రవంతిలో కలవాల్సిందే అని తుపాకిని చేత పట్టి అమాయకులను చంపుతుంటే వారితో చర్చలేంటని బిజెపి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు. కాగజ్నగర్ నుండి కరీంనగర్ కు వెళ్తూ మార్గ మధ్యలో గోదావరిఖని ఎన్టీపీసీలోని బిజెపి నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నక్సల్స్ పై నిషేధం విధించిన కాంగ్రెస్ పార్టీనే నక్సల్స్ తో చర్చలు జరపాలని చెప్పడం కాంగ్రెస్ పార్టీ రెండు నాలుకల ధోరణికి నిదర్శనం అన్నారు. తుపాకి పట్టుకొని అమాయకులను చంపుతుంటే సామాజిక కోణంతో చూడాలనడం బాధాకరమని తుపాకిని పట్టి చాంపేటోళ్లతో అసలు చర్చలు ఏంటని ప్రశ్నించారు. ప్రశాబ్దాలుగా నక్సల్స్ చేసిన హింసతో ఎంతోమంది మృతి చెందారని నెత్తిరోడిన దృశ్యాలను చూసిన ప్రొఫెసర్ హరగోపాల్, వరహరరావు సాధించింది ఏమిటో చెప్పాలని ప్రశ్నించారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగనణ పేరుతో డ్రామాలాడుతుందన్నారు. రాష్ట్రంలో 50% ఇండ్లకు కూడా వెళ్లకుండానే సర్వే పూర్తి చేశారని దీంతో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీ కులగనణ పేరుతో టైంపాస్ చేస్తుందని ఆరోపించారు. 52 శాతం జనాభా ఉంటే 46 శాతానికి కుదించి 42 శాతం రిజర్వేషన్లలో 10 శాతం ముస్లింలకు కేటాయించడం దారుణం అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని మోదీ ప్రభుత్వం జన గణన మాదిరిగా ఇంటింటికి వెళ్లి కులగనన చేస్తుందని బీసీలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దబోతుందని బీసీల వాస్తవ జనాభా లెక్కలను తేల్చి చెప్తామన్నారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం 12 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసిందని. ఒక నేషనల్ హైవే అభివృద్ధి కోసమే 1,25,485 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. అంతేకాక రైల్వే అభివృద్ధి కోసం 32 వేల కోట్ల రూపాయలు, వడ్ల కొనుగోలు కోసం లక్షన్నర కోట్ల రూపాయల దాకా ఖర్చు చేసామని, మోడీ ప్రభుత్వం ఇంత చేసిన కేంద్రం నయా పైసా కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీపై దుష్ప్రచారం చేస్తుందని కేంద్రం ఖర్చు చేసిన నిధులపై లెక్క పత్రంతో సహా వివరిస్తామని దీనిపై చర్చకు రావాలని బండి సంజయ్ సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేకు, సమగ్ర కుటుంబ సర్వేకు పొంతనలేదని ఆరోపించారు. అలాగే ఆపరేషన్ కగార్ ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని కాంగ్రెస్ పార్టీ కొత్త నాటకం మొదలు పెట్టిందని అసలు నక్సల్స్ విధించిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని ఈరోజు వారి మెప్పు పొందడానికి కేసీఆర్,రేవంత్ రెడ్డిలు పోటీపడుతున్నారని అన్నారు. పదేళ్లు పాలించిన కేసీఆర్ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నక్సల్స్ పై నిషేధాన్ని ఎత్తివేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతల సమస్యను ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తామని చెప్పడం రెండు నాలుకల ధోరణికి నిదర్శనం అన్నారు. ఆనాడు టిడిపిలో రేవంత్ రెడ్డి ఉన్నప్పుడే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుపై నక్సల్స్ అలిపిరి వద్ద బాంబులు పేల్చి చంపాలని చూసింది నిజం కాదా.. అజాతశత్రువు శ్రీపాదరావును చంపింది నిజం కాదా.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చిట్టెం నర్సిరెడ్డి, రాగ్యా నాయక్ లను చంపింది నిజం కాదా.. ఇన్ఫార్మర్ల పేరుతో అమాయక గిరిజన ప్రజలను చంపుతుంటే ఎలా చూస్తూ ఊరుకోవాలని ఆయన ప్రశ్నించారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :