Sunday, 26 April 2026 06:01:57 PM

ప్రజాసేవకు నిలువుటద్దం మాజీ తాజా కార్పొరేటర్ దొంత శ్రీనివాస్...

ఆత్మీయతతో సన్మానించిన పలు సంఘాలు...

Date : 29 January 2025 02:44 PM Views : 448

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రాజకీయ నాయకులంటే హామీలకే పరిమితం కాకుండా ఆచరణలో సైతం నిలబడ్డనాడే ప్రజల్లో విశ్వాసాన్ని చూడకుంటారనేది అక్షర సత్యం, రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 33 వ డివిజన్ ప్రజల ఆదర అభిమానులతో భారీ మెజార్టీతో ఎన్నికలవడమే కాకుండా ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ ప్రజల్లో మమేకమై కార్పొరేటర్ గా కాకుండా ఒక ప్రజా సేవకునిగా ప్రజల పక్షమే తన పక్షమంటూ దొంత శ్రీనివాస్ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన సందర్భంగా పలు సంఘాల బాధ్యులు ఘనంగా సత్కరించారు. డివిజన్ లో ఒక సభ్యునిగా ప్రజా సేవకునిగా ఐదు సంవత్సరాలు పనిచేయడం పట్ల డివిజన్ ప్రజలతో పాటు శ్రేయోభిలాషులు వివిధ మహిళా సంఘాలు ఆర్పీలు అంగన్వాడీలు ఇతర సంబంధించిన శ్రేయోభిలాషులంతా కలిసి ఐదు సంవత్సరాల పాటు తమ సేవకు అంకితమైన ప్రజాసేవకునికి ఘనంగా దొంత శ్రీనివాస్ ఆయన సతీమణి కవితను కూడా ఆత్మీయంగా సత్కరించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ. ఐదు సంవత్సరాల పాటు తనతో కలిసి తనకు సహకారం అందించిన డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల్లో తన గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆర్పీలు అంగన్వాడీలు పారిశుద్ధ కార్మికులు ఎలక్ట్రిషన్ తదితరులంతా తనకు సహాయ సహకారాలు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఐదు సంవత్సరాల పాటు తనకు చేదోడువాదోడుగా నిలిచి తాను చేస్తున్న ప్రజాసేవకు భరోసా కల్పించి తనకు సహకరించిన ప్రతి వ్యక్తికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తన సేవకు గుర్తింపుగా తనకు ఆత్మీయంగా సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు. పదవిలో ఉన్న లేకపోయినా 33 వ డివిజన్ ప్రజల సేవకి ఎప్పుడు ముందుంటానని తాజా మాజీ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సమ్మయ్య శంకర్ సాంబయ్య మల్లమ్మ లక్ష్మి అనిత మహేష్ మమత సౌందర్య రవిశంకర్ డాక్టర్ యుగంధర్ మారుపాక శంకర్ చెరుకు తిరుపతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :