Friday, 12 June 2026 12:44:38 AM

ఆదర్శ దంపతుల స్ఫూర్తిదాయకమైన నిర్ణయం..!

మరణానంతరం నేత్ర, అవయవ, దేహదానంకు అంగీకారం.... దంపతులను అభినందించిన సదాశయ ఫౌండేషన్

Date : 18 April 2025 05:34 PM Views : 322

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఓదెలలోని సెంట్రింగ్ వర్క్, (ఆర్టిస్ట్ ) కార్యక్రమాలు నిర్వహిస్తున్న రేగుల సువర్ణ - సదానందం దంపతులు గురువారం స్ఫూర్తి దాయకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. సువర్ణ సదానందం 25వ వివాహ దినోత్సవం సందర్భంగా తమ ఇద్దరి మరణానంతరం ఇద్దరి నేత్రాలు, అవయవాలు, దేహదానాలను చేస్తామని దంపతులిద్దరూ అంగీకారాన్ని ప్రకటించారు. ఈ సంద్భంగా వారి నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, సదాశయ ఫౌండేషన్ జాతీయ కార్యదర్శి మెర్గు భీష్మాచారి, రాజమౌళి కి దంపతులు వారి అంగీకార పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... నేత్ర అవయవాలు దానం చేసి పలువురికి పునర్జన్మ కల్పించాలని సంకల్పించడం, అలాగే తమ దేహాలను వైద్య విద్యార్థుల పరిశోధన కోసం దోహదపడాలని తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. అనంతరం దంపతులకు సదాశయ ఫౌండేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఆరెల్లి రాజమౌళి అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వీరి కుమారులు హర్షవర్ధన్ పార్దివన్ కూతురు మైథిలిపాటు కనికి రెడ్డి సతీష్ బైరి వినోద్. ఖ్యాతం మల్లేశం. సారంగం బంధువులు తదితరులు పాల్గొన్నారు. వీరిని సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ప్రచార కార్యదర్శి కె ఎస్ వాసు నూక రమేష్ భీమనపల్లి పృథ్విరాజ్ చెరుకు శంకరయ్య అభినందించారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :