Tuesday, 28 July 2026 06:07:30 AM

ఘనంగా ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి ఉత్సవాలు...

Date : 31 January 2025 01:32 PM Views : 447

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ మాల సంఘం ఆధ్వర్యంలో మాల సంఘం ఆఫీస్ వద్ద ప్రజాయుద్ధనౌక గద్దర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా దాసరి రామస్వామి మాట్లాడుతూ.. పీడిత ప్రజల కోసం అడవి బిడ్డల హక్కుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం ఆర్నిషలు పోరాటాలు చేసిన అడవి బిడ్డల కోసం భూ పంపిణీ కార్యక్రమాలను అనేక రకాలుగా పోరాటాలు చేసి తన జీవితాన్ని ప్రజలకు అంకితం చేసిన గద్దర్ మన ముందు లేకపోవడం బాధాకరం అని అన్నారు. ప్రజా పోరాటాలను జరుపుతున్న సమయంలో గత ప్రభుత్వాలు గద్దర్ పైన కాల్పులు జరిపిన గని ప్రజల కోసం ప్రాణ త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి గద్దర్ అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాల సంఘం కార్య నిర్వహక అధ్యక్షులు కొండ కుమార్, ప్రధాన కార్యదర్శి మర్రి ఐలయ్య, మాల సంఘం సాంస్కృతిక శాఖ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బొమ్మక వెంకటేశ్వర్లు, ఎరుకల లింగమూర్తి, బీసీ సంఘాల నాయకులు ఎజ్జ రాజయ్య, నూకలముండయ్య, దాసరి రాజయ్య, సంబోజి మల్లయ్య, ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మాల సంఘం, బీసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :