ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : అధికార పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగుబాటు తప్పదని, ప్రజల బుద్ధి చెప్పే రోజులు వచ్చాయని డిప్యూటీ మీర్ అభిషేక్ రావు అచ్చ వేణులు అన్నారు. శుక్రవారం గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ... 6 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పని చేసిన కొప్పుల ఈశ్వర్ పై ఏ హోదాతో విమర్శలు చేసావని వారు ప్రశ్నించారు. రామగుండం నియోజకవర్గంలో ప్రజలను మభ్యపెడుతూ కూల్చడమే తప్ప అభివృద్ధి ఏమి జరగడం లేదని అన్నారు. అసలు ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారో అధికారులకే తెలియదని కనీసం దీనిపై మీకు అయిన పూర్తి అవగాహనా ఉందా అని ప్రశ్నించారు. అంతే కాకుండా కేవలం రామగుండంలో కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. మీడియా సమావేశంలో అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కానీ పరిస్థితి నెలకొంటుదన్నారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండానే కూల్చివేతలు చేయడం ఏంటని ప్రశ్నించారు. మాజీ మంత్రి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అసలు నువ్వు ఏ స్థాయిలో ఉన్నవో ఆలోచించుకోవాలని అన్నారు. మరో సరి ఇలాంటి ఆరోపణలు చేయడం మానుకోవాలని వారు సూచించారు. ఈ విలేకరుల సమావేశంలో కార్పొరేటర్లు బాదే అంజలి, గాదం విజయ, కృష్ణవేణి, నారాయణదాసు మారుతీ. గోపు ఐలయ్య యాదవ్, నూతి తిరుపతి, మెతుకు దేవరాజ్, తోకల రమేష్, సట్టు శ్రీనివాస్, యాసర్ల తిమోతి, అవునూరి వెంకటేష్, ఇరుగురాళ్ల శ్రావణ్, సమ్మెట స్వప్న, సంధ్యారెడ్డి, గడ్డం నారాయణ, ఐలయ్య,ఈదునూరి శంకర్, ఈదునూరి పర్వతాలు తదితరులు పాల్గొన్నారు
Admin
Aakanksha News