Tuesday, 28 July 2026 04:02:59 AM

ఆరు గ్యారంటీల అమలు కోసం..చలో హైదరాబాద్ ను జయప్రదంచేయండి...

Date : 17 February 2025 02:13 PM Views : 479

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గంగానగర్ లో 6 గ్యారంటీలను అమలు చేయాలనీ కోరుతూ ఫిబ్రవరి 20 వ తేదీన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సీపీఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పోస్టర్లు ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి న్యూడెమోక్రసీ టౌన్ నాయకులు ఎడ్ల. రవి కుమార్ హాజరై మాట్లాడుతూ... ఎన్నికలలో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామని చెప్పి నేటికీ 14 నెలలు అయినా ఇప్పటి వరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప ఏ ఒక్క గ్యారెంటీలను కూడా పూర్తిగా అమలు చేయలేదని అన్నారు. రైతు రుణా మాఫీ చేయలేదని , కౌలు రైతులకి రైతు బంధు కూడా వేయలేదని,ఒక్క ఇంధీరమ్మ ఇళ్ళు కూడా మంజూరు చేయలేదని, వృద్దుల, వితంతు, వికలాంగుల పెన్షన్ ఇంకా పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఆరు గ్యారంటీలను అమలు చేయకుంటే తెలంగాణలో ప్రజా ఉద్యమాలను మరింత ఉదృతం చేస్తా మని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మోటార్ వర్కర్స్ యూనియన్(ఐ ఎఫ్ టీ యు)నాయకులు టి. బాలాజీ, ఎన్. రవి, ధర్మయ్య బాబు, కొమరయ్య, ఇస్తారీ,గజ్జల. వెంకటేష్. తదితరులు పాల్గొన్నారు

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :