Wednesday, 29 July 2026 05:46:51 AM

శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు...

ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ట్రాఫిక్ అడ్వైజరి.. రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్..

Date : 03 December 2024 01:53 PM Views : 526

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పెద్దపల్లిలో గ్రూప్ -4 అభ్యర్థులకు నియామక పత్రాల అందచేత, పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమాల నేపధ్యంలో ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా సామాన్య ప్రజలకు ఎలాంటి ట్రాఫిక్ సమస్య కలగకూడదని ప్రజల సౌకర్యార్థం ముందస్తుగా ట్రాఫిక్ డైవర్షన్స్ గురించి పోలీస్ సూచనలు ఇవ్వడం జరుగుతుందని కావున ప్రజలందరూ సహకరించగలరని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. రేపు ఉదయం 10 గంటల నుండి ముఖ్యమంత్రి పర్యటన ముగింపు వరకు ప్రజలు కింద తెలిపిన ఇతర ప్రత్యామ్నాయ రవాణా మార్గాలు చూసుకోవాలన్నారు. రామగుండం నుండి కరీంనగర్ వైపు వెళ్ళు అన్ని వాహనాలు ధర్మారం-X రోడ్ బసంత్ నగర్ ద్వారా కుక్కలగూడూరు, రాజారాంపల్లి, ధర్మారం, చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలని, మంథని వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్ళు భారీ వాహనాలు అప్పన్నపేట, ధర్మారం-X రోడ్ బసంత్ నగర్ ద్వారా కుక్కలగూడూరు, రాజారాంపల్లి, ధర్మారం, చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలని మంథని వైపు నుండి కరీంనగర్ వైపు వెళ్ళు 4 వీలర్లు అప్పన్నపేట నుండి ఎడమ వైపు తీసుకుని బొంపల్లి, దొంగతుర్తి, ధర్మారం, చొప్పదండి ద్వారా కరీంనగర్ వైపు వెళ్ళాలని తెలిపారు. అలాగే కరీంనగర్ నుండి రామగుండం, మంథని వైపు వెళ్ళు భారీ వాహనాలు ముగ్దుంపూర్-X రోడ్ నుండి కరీంనగర్-లక్సెట్టిపేట రోడ్ ద్వారా చొప్పదండి, ధర్మారం, రాజారాంపల్లి వద్ద కుడి వైపు తీసుకుని కుక్కలగూడూర్, ధర్మారం-X రోడ్ ద్వారా రాజీవ్ రహదారి కరీంనగర్-రామగుండం కు చేరుకుని రామగుండం, మంథనివైపు వెళ్ళాలన్నారు.కరీంనగర్ నుండి పెద్దపల్లి రామగుండం వైపు వచ్చే 4 వీలర్ లు సుల్తానాబాద్ మండలం నారాయణపూర్-X రోడ్ నుండి నారాయణపూర్, కోదురుపాక, నిమ్మనపల్లి, పెద్దపల్లి సాగర్ రోడ్ , జూనియర్ కాలేజ్ రోడ్(MB గార్డెన్ రోడ్), అయ్యప్ప జంక్షన్ ద్వారా రామగుండం మంథని వైపు వెళ్లవచ్చు అని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్బంగా ఎవరైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా కార్యక్రమాలు చేసిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎం. శ్రీనివాస్ హెచ్చరించారు. చట్టవ్యతిరేక, ప్రజా శాంతికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎలాంటి సంఘటనలకు తావు లేకుండా ప్రశాంత వాతావరణం ఉండాలని అన్ని వర్గాల ప్రజలు శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులతో సహకరించాలని సీపీ కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :