Tuesday, 28 July 2026 10:43:07 AM

కష్టం వస్తే కలిసొచ్చేది వ్యాపార విద్యావేత్తలు కాదు.. ప్రజా నాయకుడు...

దోపిడిదారులకు ఉద్యమకారులకు మధ్య జరుగుతున్న పోటీ... సర్దార్ రవీందర్ సింగ్...

Date : 25 February 2025 12:28 PM Views : 520

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఉద్యోగులకు, నిరుద్యోగులకు కష్టం వస్తే కలిసి వచ్చేది వ్యాపార విద్యావేత్తలు కాదు... ప్రజా నాయకుడు అని ఎమ్మెల్సీ అభ్యర్థి సర్దార్ రవీందర్ సింగ్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు దోపిడీదారులకు మధ్య ఉద్యమకారులకు జరుగుతున్న పోటీ అని పేర్కొన్నారు. ఎన్నికలు న్యాయ బద్ధంగా జరగడంలేదని పోటీ చేసే అభ్యర్థులు విద్యావంతులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని అన్నారు. విద్య వ్యాపారవేత్తలు సరస్వతి దేవిని అమ్ముకుంటున్నారని ఫీజులు లేకుండా ఇప్పటి వరకు మీరు ఏమైనా చేశారా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమం కోసం పనిచేయని ఉద్యమంలో రాజీనామా చేయని వారు ఎన్నికల్లో పోటీ చేస్తూ నాయకులని చెప్పుకొని తిరుగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్నికల కమిషన్ ఆర్టికల్ 21ని ఉల్లంఘిస్తుందని పేరు పక్కన చిరునామా ఫోన్ నెంబర్ లేకుండా ఫోన్ నెంబర్ ఇవ్వడంతో వారి ఆధార్ కార్డు బ్యాంకు డీటెయిల్స్ తీసుకునే వీలుంటుందని దీనిపై హైకోర్టులో పిటిషన్ వేస్తామన్నారు. అయితే 4వ నెంబర్ లో ఉండాల్సిన నా పేరును 11 నెంబర్కు మార్చి లిస్టులో లేని బీఫామ్ ఇచ్చిన నాపై కుట్రపన్నారని విమర్శించారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :