Wednesday, 29 July 2026 02:00:48 PM

బ్రాహ్మణపల్లిలో పీఎం కిసాన్ 20వ విడత నిధుల విడుదల కార్యక్రమం...

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోదీ చేతుల మీదుగా నిధుల విడుదల...

Date : 02 August 2025 12:52 PM Views : 441

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలోని రైతు వేదికలో రామగిరి కృషి విజ్ఞాన్ కేంద్రం (KVK) ఆధ్వర్యంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 20వ విడత నిధుల విడుదల కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దేశవ్యాప్తంగా రైతులకు నిధులు విడుదల చేయగా, ఆ కార్యక్రమాన్ని అక్కడ ప్రత్యక్ష ప్రసారంగా చూపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భక్తి శ్రీనివాస్, సహాయ వ్యవసాయ సంచాలకులు శ్రీనాథ్, కేవీకే రామగిరి శాస్త్రవేత్తలు మరియు కోఆర్డినేటర్ డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవ్య, మండల వ్యవసాయ అధికారి అలివేణి, అలాగే పెద్దపల్లి మండలం ఆరు క్లస్టర్ల వ్యవసాయ విస్తీర్ణ అధికారులు వినయ్, సువర్చల, పూర్ణచందర్, రచన, కల్పన, ప్రశాంత్ పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో రైతు సోదరులు హాజరై ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. పీఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధిపొందుతున్న రైతులు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన వ్యవసాయ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :