Wednesday, 29 July 2026 08:02:40 AM

కులగణనతో దేశంలో సామాజిక ఐక్యత బలపడుతుంది...

కులగణనకు కాంగ్రెస్‌,వామపక్షాలు తొలి నుంచీ వ్యతిరేకం... బిజేపి రామగుండం ఇంచార్జీ కందుల సంధ్యారాణి

Date : 02 May 2025 02:08 PM Views : 478

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : భారతదేశ వ్యాప్తంగా జనగణనతో పాటే కుల గణనను చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, బీజేపీ ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షులు అందమల్ల ఆనంద్ గౌడ్ సూచనల మేరకు బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కందుల సంధ్యారాణి హాజరై మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటు కులగణనను చేపట్టాలని మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుందని అన్నారు. పారదర్శకతతో దేశవ్యాప్తంగా కులగణన చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలకంటే సామాజిక అభివృద్ధికే పెద్దపీట వేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు వారి స్వార్ధ రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీశాయని ఇలాంటి వాటితో సమాజంలో చాలా సందేహాలు ఉంటాయి అన్నారు. కానీ మోడీ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వం దేశంలో సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యమే ధ్యేయంగా కులగణను చేపట్టడం జరుగుతుందన్నారు.కులగణనకు కాంగ్రెస్‌ తొలి నుంచీ వ్యతిరేకం అని బిజెపి ప్రభుత్వం జరిపే జన కులగణనతో దేశం పటిష్ఠంగా మారుతుందని అన్నారు.. ఏ వర్గాన్నీ నొప్పించకుండా 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటాను మేం తీసుకొచ్చామని, అదే విధంగా అందరికీ న్యాయం జరిగేలా కుల గణన ఉంటుంది అన్నారు . కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటే కులగణనను నిర్వహించాలని తీర్మానించడం జరిగిందని తెలిపారు. తెలంగాణ, కర్ణాటకల్లో కులగణన కాంగ్రెస్ జరిపిన కుల అస్తవ్యస్తంగా ఉందనీ,అది కేవలం వారి రాజకీయంగా స్వార్థం కోసం చేశారన్నారు . స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చేపట్టిన జనాభా లెక్కల్లో కులగణనను చేర్చలేదని 2010లో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్‌ సమావేశంలో కుల గణనపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆ మేరకు లోక్‌సభకు హామీ ఇచ్చారు కానీ, మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి కులగణనకు బదులు సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించారన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్‌ నేతృత్వంలోని కూటమి కులగణనను వాడుకుంటున్నాయి అని వారు ఆరోపించారు. జనగణన కేంద్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. జనగణన రాజ్యాంగం బద్దంగా చేస్తోంది అన్నారు. రాజకీయాల వల్ల మన సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండేందుకు కులగణనను జనాభా లెక్కల్లో భాగంగా పారదర్శకంగా నిర్వహించాలని కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయించిందని అన్నారు. ఉత్తుత్తి సర్వేలు జరపడం తమ లక్ష్యం కాదని తెలిపారు. తాము జరిపే జనగణన, కులగణనతో దేశ సామాజిక, ఆర్థిక నిర్మాణం పటిష్ఠం అవుతుందని, దేశం అభివృద్ధి పథంలోకి పయనిస్తుందన్నారు. దేశ, సమాజ ప్రయోజనాలకు, విలువలకు మోదీ ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో ఈ నిర్ణయంతో స్పష్టమవుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతు గౌడ్ మరియు ఓబిసి మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ, జిల్లా నాయకులు కోమల మహేష్, జక్కుల నరహరి, మచ్చ విశ్వాస్, బిజెపి మండల అధ్యక్షులు కోడూరు రమేష్, గుండు బోయిన భూమయ్య, మిట్టపల్లి సతీష్ కుమార్, బోడకుంట సుభాష్ నాయకులు తోట కుమార స్వామి, పల్లికొండ నర్సింగ్,తడగొండ నరసయ్య,అందె రాజకుమార్ చారి,బుంగ మహేష్, శివరామకృష్ణ,ఇరుగురాల శివకుమార్, కాదాసి శంకర్, మామిడి వీరేశం,దండు పవన్, ప్రవీణ్, పద్మ, అపర్ణ, సుద్దాల సాయి చరణ్, మబ్బు శివ, అయితే పవన్, శివకుమార్,తోకల రాజు,కన్నూరి రజినీకర్,జాతర్ల చంద్రయ్య, గద్దల దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు...

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :