ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : నీళ్లు నిధులు నియామకాలు ఈ ప్రాంత ప్రజలకే కావాలనే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భావం జరిగిందని రామగుండం నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఈ సందర్బంగా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించి 25 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే రజతోత్సవ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గడపకు సంక్షేమ పథకాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగంగా తీర్చిదిద్దిడం కోసం కృషి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ సభలో రాబోయే కాలంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు యువకులు సకలజనుల అందరూ కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణతో ముందుకు నడవాలి తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే దానిపై దిశ నిర్దేశం చేస్తారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకం అందించడం కోసం ఎంతో కృషి చేసారని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఉన్న ఉద్యమకారులు, బీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు సకల జనుల అందరు రజతోత్సవ వేడుకల్లో పాల్గొని మరొకసారి మన ఉద్యమ చైతన్యాన్ని నిలపాలని అన్నారు.
Reporter
Aakanksha News