ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఇసుకను దోపిడికి గురి చేస్తూ రెండు కోట్లకు పైగా ఇసుక పేరిట ప్రభుత్వ ఖజానాను కాంగ్రెస్ ప్రభుత్వం కొల్లగొడుతుందని బీఆర్ఎస్ పార్టీ మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.... రాష్ట్రంలో నీరు లేక పంటలు ఎండిపోయి ప్రజలు తల్లడిల్లుతున్నారని, ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టవా అని ఆయన ప్రశ్నించారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎక్కడ చూసినా రైతులు అరిగోసపడుతున్నారని అన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పంట పొలాలకు సరిగ్గా నీరు లేక రైతులు తీవ్రంగా నష్టపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు. దీంతో పాటు తాగడానికి మంచినీరు కూడా సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు ఎన్నో తిప్పలను పడాల్సి వస్తుందన్నారు. ఎన్నికల సమయంలో సాధ్యం కానీ హామీలను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించేందుకు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కార్యకర్తలతో కలిసి దాదాపు 180 కిలోమీటర్లు గోదావరి గోస పేరుతో పాదయాత్ర నిర్వహించి బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సమస్యలను వివరించారని పేర్కొన్నారు. దీనిపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఒకసారి గోదావరి వద్దకు వెళ్లి చూస్తే వారికే అర్థమవుతుందని, అందరికీ కనిపించి వారికి మాత్రమే కనిపించడం లేదంటే వాళ్లే అర్థం చేసుకోవాలని హితవు పలికారు. మండుటలో పాదయాత్ర నిర్వహిస్తే ఇలాంటి చౌకబారు మాటలు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం అని అన్నారు. మాయ మాటలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీ పదవి దక్కించుకున్నదని కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తిస్థాయిలో మరమ్మత్తులు చేసి సాగు నీటిని ఆపాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం తాగు, సాగు తాగునీటితో సస్యశ్యామలం అయ్యే వరకు ఊరుకునేది లేదన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం జలసిరిలను సంతరించుకుందన్నారు.
Admin
Aakanksha News