Tuesday, 28 July 2026 11:55:58 AM

అనారోగ్యంతో మృతి చెందిన ఆశ వర్కర్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి..

Date : 31 March 2025 07:40 PM Views : 1093

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి మండలం గుర్రంపల్లె గ్రామానికి చెందిన ఈర్ల లక్ష్మి రాఘవపూర్ పీఎస్సీలో ఆశ వర్కర్ గా గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తోంది. అయితే ఈ క్రమంలోనే ఈ నెల 23 వ తేదీన అనారోగ్యానికి గురై ఆశ వర్కర్ మృతి చెందింది. వారి కుటుంబానికి బాసటగా తోటి ఆశ వర్కర్లు నిలిచారు. మృతురాలి కుటుంబానికి 22 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షురాలు అనవేన స్వరూప, పీహెచ్ సీ అధ్యక్షురాలు జక్కుల శోభ మాట్లాడుతూ.. ప్రాణాలను ప్రాణంగా పెట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు పని చేస్తున్న తమకు ఉద్యోగ భద్రత కరువైందని అన్నారు. కరోనా సమయంలో తమ కుటుంబాలను కూడా భర్త,పిల్లలను కూడా వదులుకొని ప్రభుత్వ ఆదేశానుసారం ఇంటింటికి తిరుగుతూ ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్న అధైర్య పడకుండా విధులు నిర్వహించిన కనీసం జీతాలు కూడా సరిగ్గా లేని పరిసితి అని పలువురు వాపోయారు. ఎన్నో సార్లు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరిన ఎప్పటి వరకు మా సమస్యలు పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసారు. అనారోగ్యంతో మృతి చెందిన ఈర్ల లక్ష్మి ఉండటానికి కనీసం సొంత ఇళ్లు కూడా లేని పరిస్థితి అని నిరుపేద కుటుంబానికి చెందిన వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తోటి ఆశ వర్కర్లు కోరారు.ఈ కార్యక్రమంలో హాస్పిటల్ అధ్యక్షురాలు మామిడి పద్మ, ప్రదాన కార్యదర్శి తిట్ల ప్రేమలత, పొన్నాల రాధిక, గడ్డం స్వరూప, తుపురి రమాదేవి,పెర్క లక్మి, సముద్రాల పద్మ, రోడ్డ పద్మ, కేసరి మానస తదితరులు పాల్గొన్నాను

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :