Tuesday, 28 July 2026 07:13:32 AM

హమాలీ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి...

ప్రజావాణిలో జిల్లా అదనపు కలెక్టర్ కు వినతిపత్రం...

Date : 24 March 2025 08:26 PM Views : 410

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : హమాలీ కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి కార్మికులకు ఈఎస్ఐ పిఎఫ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ కు ప్రజావాణిలో తెలంగాణ హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పలువురు భారతీయులు మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లాలో వేల సంఖ్యలో హమాలీ కార్మికులు పనిచేస్తున్నారని చాలీచాలని వేతనాలతో జీవనం సాగిస్తున్నారని వెంటనే వారికి పని భద్రతతో పాటు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఆయా గౌడేన్ ల యాజమాన్యాలు, హెచ్ఎంటి కాంట్రాక్టర్లు అరకుర వేతనాలు చెల్లిస్తూ హమాలీ కార్మికులను భయభ్రాంతులకు గురిచేస్తూ పనికి తగిన వేతనాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే ఎవరైనా తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే పనుల నుండి తొలగిస్తూ బీహార్ వలస కార్మికులతో పనులు ఉపాధి లేకుండా చేస్తున్నారని వారు మండిపడ్డారు. కార్మిక సమస్యలపై చర్చించడానికి సంబంధిత అధికారులు యూనియన్ నాయకులు ప్రతినిధులతో కలిసి జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేయాలని వారు వినతిపత్రంలో కోరారు. ఈ వినతి పత్రం వారిలో తెలంగాణ హమాలి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి ఏ వెంకటరెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జంగ సంపత్ యాదవ్, కొమ్ము మధుకర్ భూమన్న, బండారు రమేష్, గట్టయ్య, గాండ్ల సంపత్, కొమ్ము సందీప్, తిరుపతి, పెద్ద బొంకూర్ రాజు, గోపి, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :