ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : RFCL లో కాంట్రాక్ట్ కార్మికుల శ్రమ మూలంగా అధికారులు పెట్టిన టార్గెట్ కు మించి యూరియా ఉత్పత్తి కొనసాగుతుందని కానీ కాంట్రాక్ట్ కార్మికుల శ్రమను మాత్రం యాజమాన్యం గుర్తించడం లేదని RFCL TUCI రాష్ట్ర నాయకులు తోకల రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎంతగానో పోరాడి సాధించుకున్న ఈ పరిశ్రమ వల్ల ఏమాత్రం ఇక్కడ నిరుద్యోగ యువతకు ఇక్కడి ప్రాంత నిర్వాసితులకు ఉపయోగకరంగా లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు యాజమాన్యం సి ఎస్ ఆర్ ఫండ్స్ తో ప్రభావిత గ్రామాలను ఏమాత్రం అభివృద్ధిని చేయలేదన్నారు. పరిశ్రమలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలు అమలు కాకపోయినప్పటికీ కార్మిక చట్టాలు అమలుకు నోచుకోక పోయినప్పటికీ యాజమాన్యం మాత్రం పట్టించుకోవడం లేదని తెలిపారు. విదిలేని పరిస్థితుల్లో ఒక యూనియన్ సమ్మె నోటీస్ ఇస్తే, మేమే పరిష్కరిస్తామంటూ మరొక యూనిట్ ముందుకు వస్తుంటే యాజమాన్యం మాత్రం ప్రేక్షక పాత్ర వహిస్తున్నదని అన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ లో కాంట్రాక్ట్ కార్మిక సమస్యలు పరిష్కరిస్తే సమ్మె అవసరం ఉండదని ఆయన అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వానికి యాజమాన్యానికి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా విజ్ఞప్తి చేస్తున్నదని. కార్మిక చట్టాలను అమలు చేయాలని. కార్మిక సంఘాలకు కాంట్రాక్టు కార్మిక సమస్యలపై చర్చించే అవకాశం స్వేచ్ఛను కల్పించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు.
Admin
Aakanksha News