Tuesday, 28 July 2026 09:35:33 AM

అంతర్జాతీయ మహిళా దినోత్సవం...

మహేశ్వరం జ్యోతి

Date : 07 March 2025 06:39 PM Views : 291

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మహిళ ఓ మహిళా ఎక్కడమ్మా నీకు విలువ పుట్టగానే ఆడపిల్ల అంటారు ఆడపిల్లె కానీ ఈడ పిల్ల కాదు అంటారు పుట్టింటలేదు స్వేచ్ఛ అత్తారింట్లో అసలే లేదు చెప్పుకోవడానికె అన్నదమ్ములు బంధాలే కరువాయే ,బాధ్యతలే ఎక్కువాయే కట్టుకున్నానికి లోకువాయే అత్తమామలకు చులకనాయే ఆడపడుచులకు అసలే అవసరం లేదాయే మహిళకు మహిళే శతృవాయే మహిళా చట్టాలు ఎన్నెన్నో డబ్బున్నోనికే అవి దగ్గరాయే కడుపులో పుట్టినోళ్లకు కన్నతల్లి బరువాయే వచ్చిన కోడలికి అత్త అసలే వద్దాయే బ్రతుకు బరువాయే చావేమో రాదాయే ఆశ్రమాలు ఎన్నో ఆయే దాతలే తల్లిదండ్రులాయే కొరివి పెట్టె కొడుకులాయే కంటిలో నీరే ఎండిపోయే ఆత్మకు శాంతి లేదయే మహిళ ఓ మహిళా ఎక్కడమ్మా నీకు విలువ ????

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :