Tuesday, 28 July 2026 10:43:07 AM

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ ను వెంటనే నియమించాలి....

టిబిజికెఎస్ ఆధ్వర్యంలో ఎసీఎం ఓ కిరణ్ రాజు కు వినతిపత్రం...

Date : 19 February 2025 08:34 PM Views : 873

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పిల్లల డాక్టర్ పీడియాట్రిక్ లేకపోవడంతో కార్మికుల కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయని వెంటనే పిల్లల డాక్టర్ ను నియమించాలని కోరుతూ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం TBGKS ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి శంకర్ ఆధ్వర్యంలో ఎసీఎం ఓ కిరణ్ రాజు కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు బాధ్యులు మాట్లాడుతూ...కొత్తగూడెం తర్వాత ప్రధాన ఆసుపత్రిగా కొనసాగుతున్న గోదావరిఖని సింగరేణి ఏరియా ఆసుపత్రిలో పీడియాట్రిక్ ( పిల్లల వైద్యులు) లేనందున సింగరేణి ఉద్యోగుల పిల్లల అనారోగ్య సమస్యలపై నిత్యం వందలాది మంది చికిత్స కోసం వచ్చి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.ఈ పరిస్థితుల్లో ఆసుపత్రిలో ఇద్దరు పిల్లల వైద్యులు 24 గంటలు వైద్య సేవలు అందించాల్సి ఉండగా ఏరియా హాస్పిటల్ నందు ఒక్కరు కూడా అందుబాటు లేకుండా ఉన్నారని . రామకృష్ణాపూర్ ఏరియా హాస్పిటల్ నుండి పిల్లల వైద్యులు మూడు రోజులు ఈ ఏరియా హాస్పిటల్ వచ్చి వైద్య సేవలు అందిస్తున్నారన్నారు. దీనితో చిన్న పిల్లలకి ఏ సమస్య వచ్చినా ప్రైవేటు ఆసుపత్రి వెళ్లాల్సి వస్తుందందున తీవ్రమైన ఇబ్బంది ఏర్పడుతుందని దీనికి తోడు చిన్న పిల్లలకు సంబంధించిన ప్రత్యేక వార్డు కూడా అందుబాటులో లేకుండా ఉండటంతో సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. వేలాది రూపాయలు ప్రైవేటు ఆసుపత్రులకు వెచ్చించి యువ కార్మికులు ఆర్థికంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. కావున సింగరేణి అస్పత్రిలో ఇద్దరు పిల్లల డాక్టర్ వెంటనే నియమించాలని పిల్లలకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేయాలని బొగ్గుగని కార్మిక సంఘం.TBGKS తరఫున డిమాండ్ చేసారు. లేనిపక్షంలో టీబీజీకే తరఫున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ మాధస్ రామ్మూర్తి. చెల్పూరి సతీష్. దూట శేషగిరి . కొండ అంజయ్య సిహెచ్ శ్రీనివాస్ జనగామ మల్లేష్ . వాసర్ల జోసెఫ్ . బొగ్గుల సాయి కృష్ణ. పుప్పాల రవీందర్. మహేందర్ రెడ్డి. మురళి. టీబీజీకే ఎస్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :