Tuesday, 28 July 2026 01:27:03 PM

మద్యం మత్తులో అర్ధరాత్రి హంగామా....

వాహనదారులకు బెదిరింపులు... వాహనాలు ధ్వసం...

Date : 25 November 2024 12:16 PM Views : 821

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : మద్యం మత్తులో ఓ వ్యక్తి అర్ధరాత్రి హంగామా సృష్టించిన సంఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని అడ్డగుంటపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అడ్డగుంటపల్లి, గౌతమినగర్ వెళ్లే ప్రధాన రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. అయితే చిత్తుగా మద్యం సేవించిన కొంత మంది వచ్చి పోయే వాహనాదారులను బెదిరించడమే కాకుండా వారిపై దాడికి ప్రయత్నాలు చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు ఇష్టానుసారంగా షాపులు నిర్వహిస్తున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని పలువురు వాపోతున్నారు. చిన్న చిట్కా వాటి మీద ప్రభావం చూపించే కొంతమంది అధికారులు ఇలాంటి వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :