Tuesday, 28 July 2026 12:10:09 PM

నైపుణ్యాభివృద్ధికి శిక్షణతో ఉపాధికి బాటలు: మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు

Date : 20 May 2025 07:55 PM Views : 646

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : రాష్ట్ర నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్న ఉద్దేశంతో సింగరేణి సంస్థ సి.ఎస్.ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ (నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంను రాష్ట్ర మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మంగళవారం రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, “నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ద్వారా యువత ఉద్యోగ అవకాశాలను సాధించగలదని తెలిపారు. ప్రభుత్వం ఈ దిశగా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని పేర్కొన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులు కేవలం సర్టిఫికెట్ కోసమే కాకుండా, నిజమైన నైపుణ్యాన్ని సంపాదించాలని సూచించారు.38 రకాల కోర్సులతో శిక్షణ ఈ కేంద్రంలో సుమారు 38 కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సర్వే నిర్వహించి, యువతకు వారి నైపుణ్యాల ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా సింగరేణి సంస్థ నిరుద్యోగ యువత కోసం చేస్తున్న ఈ విధమైన శిక్షణా కార్యక్రమాలు అభినందనీయమని, ఈ కేంద్రాన్ని భవిష్యత్తులో ఉద్యోగాల నియామక కేంద్రంగా అభివృద్ధి చేయాలని కోరారు. ఈ శిక్షణా కేంద్రం ద్వారా స్థానిక యువత ఉపాధి అవకాశాలను వినియోగించుకుని, మెరుగైన భవిష్యత్తును నిర్మించుకోవాలని నేతలు ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఇతర ప్రభుత్వ అధికారులు, సింగరేణి యాజమాన్యం, కార్మిక సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :