Tuesday, 28 July 2026 06:18:51 AM

ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలి.

పెద్దపల్లిలో శాంతి ర్యాలీ.

Date : 07 April 2025 07:22 PM Views : 475

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ప్రవీణ్ పగడాల మృతిపై నిజనిర్ధారణ చేయాలని పెద్దపల్లిలో శాంతి ర్యాలీ నిర్వహించారు. పెద్దపల్లి పట్టణంలోని పాస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పాస్టర్ పగడాల ప్రవీణ్ అనుమానాస్పద మృతి సందర్భంగా సోమవారం శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు షడ్రక్ పాస్టర్ సుదర్శన్ మాట్లాడుతూ ఇటు తెలంగాణ ప్రభుత్వం, అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారులు ప్రవీణ్ పగడాల మృతిపై సరైన న్యాయం చేయాలన్నారు. పాస్టర్ డేవిడ్ మాట్లాడుతూ ప్రవీణ్ పగడాల మతం కన్నా మానవత్వం ఉన్నవాడని, అనాధ పిల్లలను అక్కున చేర్చుకొని విద్యను నేర్పించి వివాహాలు చేశాడన్నారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించి, ఉద్యోగస్తులుగా మార్చాడని, వారి కుటుంబ ఆర్థిక అభివృద్ధిని పెంపొందించడానికి కృషి చేశాడని తెలిపారు. కుల నిర్మూలనకు కృషి చేస్తూ, మనిషిని మతం దృష్టితో చూడకుండా మనిషిని మనిషిలా చూడాలని హితబోధ చేసేవాడన్నారు. ఇండియన్ మిషన్ స్కూల్ నుండి బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతి ర్యాలి నిర్వహించి అక్కడ కొవ్వొత్తులు వెలిగించి ప్రార్థనలు చేశారు. కార్యక్రమంలో పలువురు పాస్టర్లు, కృష్టియన్లు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :