ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ రామగుండం నియోజకవర్గ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. దసరా పండుగ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ కుటుంబ సమేతంగా ఆనందొత్సవాలతో పండుగను జరుపుకోవాలని ఆకాంక్షించారు. చెడుపై విజయానికి చిహ్నంగా దసరా పండుగను జరుపుకుంటారని అన్నారు. తెలంగాణ సబ్బండ వర్గాల ఐక్యతకు నిదర్శనం అని వివరించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖశాంతులతో, సిరిసంపదలతో, వర్ధిల్లాలని ప్రతి ఒక్కరికి చేసే పనులలో విజయం సిద్ధించాలని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆకాంక్షించారు.
Admin
Aakanksha News