Wednesday, 29 July 2026 09:01:04 AM

విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఆర్టిజన్, కన్వర్షన్ కార్మికులసమస్యలు పరిష్కరించాలి...

Date : 21 January 2025 08:16 PM Views : 466

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని విద్యుత్ శాఖ ఎస్సీ కార్యాలయ ఆవరణలో రెండో రోజు విద్యుత్ ఆర్టిజన్ కార్మికులు నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షకు మద్దతుగా సిపిఐ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు తాండ్ర. సదానందం, బిఆర్ఎస్ పార్టీ నాయకురాలు దాసరి ఉష,ఆర్టిజన్ జెఎసి రాష్ట్ర ఫైనాన్స్ సెక్రటరీ సుంకర.సదానందం,సిఐటియు నాయకులు బిక్షపతి హాజరై వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ...ఇప్పటికైనా రాష్ట్రం ప్రభుత్వం, విద్యుత్ శాఖ యాజమాన్యం స్పందించి ట్రాన్స్ కో ,జెన్ కో ,డిస్కంలో పనిచేస్తున్న ఇరవై వేల మంది ఆర్టిజన్స్ ని విద్యార్హతలను బట్టి కన్వర్షన్ చేయాలని ,స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారం ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి ఆర్టిజన్ కి ఇంక్రిమెంట్ ,గ్రేడ్ ప్రమోషన్ కూడా ఇవ్వాలని ఆర్టిజన్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని,పర్మనెంట్ ఉద్యోగులతో సమానంగా గుర్తించాలని డిమాండ్ చేశారు.వారి సమస్యలు పరిష్కారం అయ్యే వరకు అండగా ఉంటామని నాయకులు తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :