Wednesday, 29 July 2026 05:46:49 AM

కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దాం...!

కార్మికులకు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల పిలుపు..

Date : 23 September 2024 01:25 PM Views : 320

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : జీడీకే 2వ ఇంక్లైన్ లో CITU, HMS, IFTU, TSUS, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మిక వ్యతిరేక చట్టాల పేపర్లను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా పలువురు కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ... 2019లో వేతనాల కోడ్ ను, 2020లో ఐఆర్ కోడ్, ఓఎహెచ్ కోడ్, సామాజిక భద్రతా కోడ్ మొత్తం నాలుగు లేబర్ కోడ్లను కేంద్ర బిజెపి ప్రభుత్వం పార్లమెంట్ లో ఆమోదించిందన్నారు. అంతకు ముందున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చి బిజెపి ప్రభుత్వం కార్మికవర్గ హక్కులను విదేశీ స్వదేశీ పెట్టుబడి దారులకు కట్టబెట్టిందని ఆరోపించారు. కార్మిక వర్గానికి తీవ్రమైన నష్టం చేసిందని పార్లమెంట్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో చర్చలు జరపకుండా యాజమాన్యాలకు కొమ్ము కాసిందని విమర్శించారు. గత నాలుగు సంవత్సరాలుగా ఈ లేబర్ కోడ్ లు రద్దు చేయాలని రెండు సార్లు దేశవ్యాప్త సమ్మెలు, సమరశీల ఉద్యమాలు జరిగినప్పటికీ బిజెపి ప్రభుత్వం లెక్క చేయడం లేదని వారు మండిపడ్డారు. 2024 పార్లమెంట్ ఎన్నికల సందర్భంలోనూ వామపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఈ లేబర్ కోడ్ లను వ్యతిరేకించినప్పటికీ బిజెపి కార్మిక వర్గానికి ద్రోహం చేయడానికే నిశ్చయించుకున్నదని. దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఈ లేబర్ కోడ్ కు సంబంధించిన రూల్స్ రూపొందించ బడ్డాయన్నారు. అలాగే కొన్ని రాష్ట్రాల్లో అమల్లోకి తెస్తున్నారని అన్నారు. అయితే యూనియన్ పెట్టుకునే హక్కు సమ్మె హక్కు, పని గంటలు, అక్రమ తొలగింపులు, మహిళా కార్మికుల హక్కులు, ఆరోగ్యం, సంక్షేమం తదితర అనేక ప్రాథమిక హక్కులకు భంగం కల్గించే ఈ లేబర్ కోడ్ లు ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో, CITU నుండి మెండె శ్రీనివాస్, పి శ్రీనివాసరావు, వంగల రాములు, ఏ శంకరన్న, పి సమ్మయ్య, తిప్పారపు రాజు, కుమార్, బీమా నాయక్, HMS నుండి రియాజ్ అహ్మద్, జక్కుల నారాయణ, రామచందర్, IFTU. నుండి ఈ నరేష్, ఈదునూరి రామకృష్ణ, ప్రసాద్, TSUS నుండి శేఖర్, రాయపోశం, పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :