Tuesday, 28 July 2026 12:32:09 PM

మహాత్మ జ్యోతిరావు పూలే అవార్డు అందుకున్న విశ్వనాధ్...

Date : 09 December 2024 06:29 PM Views : 363

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : పెద్దపల్లి జిల్లా యైటింక్లెయిన్ కాలనీకి చెందిన సమతా ఫౌండేషన్ సభ్యుడు దుర్గం విశ్వనాధ్ భారతీయ దళిత సాహిత్య అకాడమీ వారి మహాత్మ జ్యోతిభా పూలే (2024) నేషనల్ ఫెలోషిప్ అవార్డును అందుకున్నారు. ఈ మేరకు సోమవారం న్యూఢిల్లీలోని పంచశీల ఆశ్రమంలో జరిగిన 40 వ భారతీయ దళిత రైటర్స్ కాన్ఫరెన్స్ సమ్మేళన కార్యక్రమంలో భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు ఎస్పి సుమానాక్షర్, రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ మను విశ్వనాధ్ కి అవార్డు ప్రధానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్య వైద్య ఉపాధి అందరికీ దక్కాలి అనే తలంపుతో పనిచేస్తున్న విశ్వనాధ సేవలను గుర్తించి అవార్డు ప్రధానం చేసినట్లు తెలిపారు. అనంతరం విశ్వనాథ్ మాట్లాడుతూ తన సేవలను గుర్తించి అవార్డుకి ప్రమోట్ చేసిన సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు, మార్షల్ దుర్గం నగేష్ కు, అవార్డు ఇచ్చిన భారతీయ దళిత సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు ఎస్పీ సుమనాక్సర్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జితేందర్ మనులకు ధన్యవాదములు తెలిపారు. ఈ అవార్డుతో తనపై మరింత బాధ్యత పెరిగిందని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని పేర్కొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :