ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం పరిధిలో ఉన్న "మల్లన్న చిన్న మాటు"ను పూడ్చివేయకుండా చూడాలని మత్స్యకార సహకార సంఘం నాయకులు ఆలయ ఈవోకు వినతిపత్రం సమర్పించారు. శుక్రవారం మత్స్య పారిశ్రామిక సంఘం అధ్యక్షుడు మంద కొమురయ్య ముదిరాజ్ కుల సంఘ పెద్దలతో కలిసి ఈ వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారు నాలుగు వందల ముదిరాజ్ కుటుంబాలు ఈ మల్లన్న మాటు ఆధారంగా జీవనోపాధి కొనసాగిస్తున్నాయని వివరించారు. గతంలో కూడా ఈ మాటులో మట్టి నింపడం వల్ల సమస్యలు తలెత్తాయని, అప్పట్లో కూడా ఆలయ అధికారులకు వినతిపత్రం ఇచ్చామని గుర్తుచేశారు. కానీ మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.మంద కొమురయ్య మాట్లాడుతూ – “మా జీవనోపాధికై ఈ చిన్న మల్లన్న మాటులో రెండు లక్షల రూపాయల విలువైన చేప పిల్లలు వదిలాం. ఇప్పుడు మట్టి నింపడం వల్ల అవి చనిపోయే ప్రమాదం ఉంది. దీంతో ముదిరాజ్ కుటుంబాలు ఆర్థికంగా దెబ్బతిని వీధిన పడే పరిస్థితి వస్తుంది. తక్షణమే ఈ మట్టిని తొలగించి మమ్మల్ని ఆదుకోవాలి” అని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కుల సంఘ ఉపాధ్యక్షులు పెండం రాములు, కార్యదర్శి తూడి సురేష్, డైరెక్టర్లు పిట్టల రవి, పసెడ్ల స్వామి, తూడి రాజయ్య, పోచవేణి విజ్జిగిరి, సభ్యులు గరిగంటి శేఖర్, మంద ధనుంజయ, కుక్కల కృష్ణ, తూడి శంకర్, పిట్టల నర్సింగం, అంజి, రాజయ్య, మధునయ్య, దస్తగిరి, సాయిలు, అనుదీప్, చందు, తిరుపతి, కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News