Tuesday, 28 July 2026 07:35:58 AM

బీఆర్ఎస్ కార్య‌కర్త‌లు ఎవరు ఆపదలో ఉన్నా పార్టీ అండగా ఉంటుంది...

Date : 20 September 2025 06:42 PM Views : 593

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / ఓదెల(పెద్దపల్లి జిల్లా) : పెద్దపల్లి నియోజకవర్గంలోని ఓదెల మండలం రూపునారాయణపేట గ్రామానికి చెందిన బిఆర్ఎస్ కార్యకర్త రాపర్తి రాజు ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఈ ఆపద సమయంలో పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన బీఆర్ఎస్ శ్రేణులు రాజు భార్య శిరీషకు ఆర్థిక సహాయంగా ₹12,600 అందజేశారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షులు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్, రూపునారాయణపేట గ్రామ అధ్యక్షులు బినవేణి పర్శరాములు గౌడ్, ఓదెల గ్రామ అధ్యక్షులు పోలోజు రమేష్, మాజీ సింగిల్ విండో డైరెక్టర్ గాజుల గణపతి గౌడ్, నాయకులు చర్లపల్లి సురేష్ గౌడ్, గడ్డం శ్యామ్, సూత్రాల శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్య‌కర్త‌లు ఎవరైనా ఆపదలో ఉన్నా పార్టీ అండగా ఉంటుందని, రాజు కుటుంబానికి భవిష్యత్తులోనూ తోడ్పాటును అందిస్తామని హామీ ఇచ్చారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :