Tuesday, 28 July 2026 12:26:46 PM

రామగుండానికి దాపరించిన శకుని కౌశిక హరి...

మతిభ్రమించి మాట్లాడుతున్న కౌశిక హరి... ఎయిర్ టెల్ రాజేష్ దొంగ... కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి...

Date : 20 February 2025 12:10 PM Views : 668

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండానికి దాపరించిన శకుని కౌశిక హరి అని ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నాడని కాంగ్రెస్ పార్టీ నాయకులు మహంకాళి స్వామి అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ పార్టీ నాయకులు కౌశిక్ హరి నమ్ముకున్న వాళ్లను గంగలో కలుపుతున్న నారదుడు అని ఎద్దేవ చేశారు. నారదుడిలో పుల్లలు పెట్టడంలో ఆయనకు ఆయనే సాటి అని సెటైర్లు వేశారు. ఇప్పటివరకు వారు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని చౌరస్తాకు రా తేల్చుకుందామని సవాల్ విసిరారు. ఎయిర్ టెల్ రాజేష్ దొంగ అని లక్షల రూపాయల కిరాయిలు తీసుకుంటున్నాడని ఆరోపించారు. బసంత్ నగర్ కేషోరాం సిమెంట్ ఫ్యాక్టరీ కార్మికులను పర్మనెంట్ చేసిన ఘనత ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ దే అన్నారు. ఎన్నికల హామీ ప్రకారం ఇతర రాష్ట్రానికి చెందిన బీహార్ కార్మికులను వెళ్లగొట్టి ఇక్కడి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామన్నారు. పీసీ పటేల్ కాంట్రాక్టు కార్మికులు ధర్నా చేస్తే యాజమాన్యంతో మాట్లాడి వారికి జీతాలు పెంచామన్నారు. లక్ష్మీ నగర్ ను అభివృద్ధి చేస్తున్నామని మార్చ్ 15వ తేదీ వరకు అన్ని రోడ్లు, డ్రైనేజీ, లైటింగ్ వాటర్ ఏర్పాటు చేసి వ్యాపారులకు అందుబాటులోకి తీసుకొని వస్తామన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :