Sunday, 26 April 2026 06:02:21 PM

గంజాయి నియంత్రణపై పటిష్టమైన నిఘా ఉంచాలి...

చట్టబద్దంగా మంచిగా పని చేసినప్పుడు తప్పక గుర్తింపు వస్తుంది... రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా...

Date : 25 March 2025 04:06 PM Views : 504

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పెద్దపల్లి, గోదావరిఖని, మంచిర్యాల సబ్ డివిజన్ పోలీస్‌ అధికారులతో పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా కమిషనరేట్‌ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీలు, అడిషనల్ డీసీపీ అడ్మిన్, ,ఎసీపీలు, ఇన్స్‌స్పెక్టర్లు, ఎస్‌.ఐలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో పోలీస్‌ కమిషనర్‌ ముందుగా పోలీస్‌ స్టేషన్‌, డివిజినల్‌, జోన్ల వారిగా పెండింగ్ కేసులకు సంబంధించి నేరస్థుల అరెస్టు, దర్యాప్తు, సాక్ష్యాధారాల సేకరణ, చార్జ్‌షీట్‌కు సంబంధించి ప్రస్తుత కేసుల స్థితిగతులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.ముఖ్యంగా కమిషనరేట్‌ పరిధిలో నమోదైన గ్రేవ్‌ కేసులు, మహిళలపై నేరాలు, ఆస్తి, పోక్సో, మిస్సింగ్‌, గంజాయి, రోడ్డు ప్రమాదాల కేసులకు సంబంధించి సమాచారంతో పాటు, కేసుల పరిష్కారం కోసం ఏ విధమైన చర్యలు తీసుకోవడం జరిగిందనే మొదలైన అంశాలపై పోలీస్‌ కమిషనర్‌ అధికారులతో సమీక్షా జరిపారు. అదే విదంగా నేరాల నియంత్రణ కోసం అధికారులు తీసుకోవాల్సిన ముందస్తూ చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ... ప్రతి ఒక్క పోలీస్ అధికారి చట్టబద్ధంగా పనిచేయాలని మంచిగా పని చేసినప్పుడు తప్పుక గుర్తింపు వస్తుందన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగే కార్యకలాపాలపై స్టేషన్ అధికారులకు ముందస్తు సమాచారం వుండాలని, ప్రతి కేసులో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవాలి, sc, st కేసులలో న్యాయపరంగా పారదర్శకంగా విచారణ జరపాలన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ లో అధికారులకు సిబ్బందికి అన్ని రకాల సమాచారంపై అవగాహనా ఉండాలని తెలిపారు. విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ వ్యవస్థను ఏర్పాటు చేసుకొని సమాచార వ్యవస్థను పటిష్టం చేయాలనీ, సిసి కెమెరాలు జరిగే విషయాలను గుర్తించడం జరుగుతుందన్నారు.ప్రజలతో మంచి సత్ససంబంధాలను కొనసాగిస్తే బయట చర్చ జరిగే ప్రతి ముందస్తు సమాచారం తెలుస్తుందని అన్నారు. దొంగతనాలు జరగకుండా అధికారులు నిరంతరం అప్రమత్తంగా వుంటూ, పెట్రోలింగ్‌ ముమ్మరం చేయాలని ప్రధాన చోరీలకు పాల్పడిన నేరస్థులను గుర్తించడంతో పాటు చోరీ సోత్తును స్వాధీనం చేసుకోవాలని సూచించారు. ప్రతి రోజు ఒక రెండు గంటల పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులకు, బాధితులకు కేటాయించాలని , రెండు గంటలు పెండింగ్‌ కేసులను సమీక్షా జరపాలని, ఏదైనా సంఘటన జరిగినప్పుడు, బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు సంఘటన స్థలానికి తప్పనిసరిగా వెళ్ళాలన్నారు. అప్పుడు క్షేత్రస్థాయిలో సమాచారం లభిస్తుందని తెలిపారు. రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలలో విలేజ్ సేఫ్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని కింది స్థాయి సిబ్బందితో మర్యాదగా ఏలాంటి భేదాలు లేకుండా ప్రవర్తించాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే శాఖ పరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. గంజాయి నియంత్రణకు పటిష్టమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని రవాణా చేసే వారిని గుర్తించి కేసులు నమోదు చేయాలని , గంజాయి సేవించే వారిపై కూడా కేసులు నమోదు చేయాలనీ ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం గంజాయి స్వాధీనం కేసులలో ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బంది కి పోలీస్ కమిషనర్ చేతుల మీదుగా రివార్డులను అందజేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల డిసిపి ఏ భాస్కర్ ఐపిఎస్., పెద్దపల్లి డిసిపి కరుణాకర్, అడిషనల్ డిసిపి అడ్మిన్ సి రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసిపి రాఘవేంద్రరావు, గోదావరిఖని ఏ సి పి ఎం రమేష్, పెద్దపెల్లి ఏసిపి జి కృష్ణ, ట్రాఫిక్ ఏసిపి నరసింహులు, ఏసిపి మల్లారెడ్డి, ఏ ఆర్ ఏసీపీ ప్రతాప్, ఏఓ శ్రీనివాస్, సీఐ లు, వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :