ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / యైటింక్లెయిన్ కాలనీ (గోదావరిఖని) : సింగరేణి సంస్థ రామగుండం రీజియన్-2 ఏరియా పరిధిలోని పోతన కాలనిలో నిర్మిస్తున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆర్జీ-2 ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఐలి శ్రీనివాస్ కోరారు. మంగళవారం నాయకులతో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...గతంలో టిబిజికెఎస్ గుర్తింపు సంగంగా ఉన్న హయంలో కార్మికుల సౌకర్యార్థం పోతన కాలనిలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ప్రతిపాదించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ విషయాన్ని కార్మిక కుటుంబాలు గ్రహించాలన్నారు.యాజమాన్యం నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్మాణం పూర్తి చేయాలని, తద్ద్వారా కార్మిక కుటుంబాలు శుభకార్యాలు జరుపుకునేందుకు ఉపయోగంగా ఉంటుందన్నారు.అలాగే అదే కమ్యూనిటీ హాల్ లో ఆరు గెస్ట్ బెడ్ రూమ్స్ నిర్మించాలని యాజమాన్యాన్ని కోరారు.ఆయన వెంట యూనియన్ సెంట్రల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ చెరుకు ప్రభాకర్ రెడ్డి, జాయింట్ సెక్రటరీ బేతి చంద్రయ్య, నాయకులు నరేష్ తదితరులు ఉన్నారు.
Admin
Aakanksha News