Tuesday, 28 July 2026 05:04:11 AM

ప్రజా సమస్యలు పరిష్కరించడంలో జర్నలిస్టులదే కీలక పాత్ర...

సామాజిక సేవకులకు ఉచిత వైద్య శిబిరం...క్యాస శ్రీనివాస్, లక్ష్మివాణి, కాజపురం (సహజ) రాజేందర్,

Date : 18 January 2025 03:27 PM Views : 722

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం పరితపించి ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న జర్నలిస్టుల ఆరోగ్యంపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) రామగుండం బ్రాంచ్, సిగ్మా హాస్పటల్ సంయుక్త సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు క్యాస శ్రీనివాస్, లక్ష్మివాణి, కాజపురం (సహజ) రాజేందర్,లు మాట్లాడుతూ... ఎప్పటికప్పుడు సమాచారాన్ని చేరవేస్తూ వార్తల రూపంలో ప్రజలకు అందిస్తూ సమయపాలన లేని వృత్తిని నిర్వహిస్తూ నిత్యం ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు బీపీ.షుగర్. గుండె సంబంధిత వాటిపై వైద్య పరీక్షలను నిర్వహించారు. సమయానికి ఆహారం తీసుకోకుండా అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఎంతో మంది జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని వారి ఆరోగ్య పరిరక్షణ కోసం, ఆరోగ్య విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వైద్య సేవలు నిర్వహించడం జరిగిందని వారన్నారు. జర్నలిస్టులు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచించారు.

ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం అభినందనీయం... ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్ ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యాంసుందర్

సమయపాలన లేకుండా విధులు నిర్వహించే జర్నలిస్టులు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం విషయంలో దృష్టి సాధించాలని గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిల్ల శ్యాంసుందర్ అన్నారు. జర్నలిస్టుల ఆరోగ్య విషయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ), సిగ్మా హాస్పిటల్ యాజమాన్యం, డాక్టర్లు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. జర్నలిస్టు పట్ల ఇలాంటి సేవలు మరెన్నో అందించాలని వారు కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :