Tuesday, 28 July 2026 12:23:19 PM

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు

Date : 17 February 2025 08:00 AM Views : 384

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / దాట్ల జేమ్స్ రెడ్డి : బీఆర్ఎస్ పార్టీ అధినేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రమేశనగర్ లో సోమవారం ఉదయం బీఆర్ఎస్ పార్టీ నాయకుడు నీరటీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పరిశుద్ధ కార్మికుల మధ్య ఘనంగా జన్మదిన వేడుకలను నిర్వహించి కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్బంగా పలువురు నాయకులు మాట్లాడుతూ..మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని .అందరి శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగేలా కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు. ఈ సందర్బంగా వారికి పారిశ్రామిక ప్రాంత ప్రజలు అండగా ఉండాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాజీ పాముకుంట్ల భాస్కర్. నీరటీ శ్రీనివాస్. చిలకలపేలి శ్రీనివాస్. అక్షర మల్లేష్ కోడి రామకృష్ణ. శ్రవణ్. శ్రీధర్ తిరుపతి . మునిసిపల్ కార్మికులు పాల్గొన్నారు

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :