ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై ఢిల్లీ బిజెపి నాయకులు మాజీ ఎమ్మెల్యే తన్వీవింధర్ సింగ్ చేసిన వ్యాఖ్యలను నిర్వహిస్తూ గోదావరిఖనిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అనంతరం మున్సిపల్ టీ జంక్షన్ వద్ద రాజీవ్ రహదారిపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ... బిజెపి నాయకులు చేసే తప్పుడు పనులను ఎత్తి చూపినందుకే రాహుల్ గాంధీపై అసభ్య పదజాలంతో వాక్యాలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. రాహుల్ గాంధీ నాలుకను కోస్తే 30 లక్షలు ఇస్తామంటూ బిజెపి నాయకులు మాట్లాడడం సరైంది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సంక్షేమం అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే ఓర్వలేకనే బిజెపి నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని అన్నారు. మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణలో బీజేపీ నాయకుల ఇళ్లను ముట్టడించి ఇంటి నుండి బయటకు వెళ్లకుండా చేస్తామని హెచ్చరించారు.ప్రజా సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే రాహుల్ గాంధీని బాధానం చేయడానికి కేంద్రంలో ఉన్న బిజెపి నాయకులు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా బిజెపి నాయకులు నోరు అదుపులో పెట్టుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సైనికుల మారి బిజెపి నాయకుల ఇండ్లను ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు. నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీపై సీనియర్ నాయకులుగా ఉన్న బిజెపి పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఇలాంటి వాక్యాలు చేయడం సరైంది కాదన్నారు.రాహుల్ గాంధీ ప్రతిపక్ష నేతగా 10 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ప్రభుత్వాల దృష్టికి అధికారుల దృష్టికి తీసుక వెళ్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడు వలే పనిచేసి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. అంతే కాకుండా తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి వారిపైన చర్యలు తీసుకోవాలని దీనికి బాధ్యత వహిస్తూ హోం శాఖ మంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో కాల్వ లింగస్వామి, రవికుమార్, పాత పెళ్లి ఎల్లయ్య, మారెల్లి రాజిరెడ్డి, దీటి బాలరాజు, బొమ్మక రాజేష్, పెద్దెల్లి ప్రకాష్ కొప్పుల శంకర్, నాయిని ఓదెలు, గట్ల రమేష్, దాసరి సాంబమూర్తి, యాకూబ్, దాసరి విజయ్, బాల రాజ్ కుమార్, కౌతమ్ సతీష్, శ్రీనివాస్ రెడ్డి, ఉదయరాజ్, ఆడెపు రవి, మాలెం మధు, హనుమ సత్యనారాయణ, గుండేటి శంకర్, తిరుపతి రెడ్డి, గుమ్మడి రవి, గడ్డం శేఖర్, కంకణాల రాజు, సాయి, బొంతల లచ్చన్న, మోహిద్ సన్ని, ఉల్లంఘిల రమేష్, బాబు మియా, గడ్డం శీను, సతీష్ గౌడ, వరలక్ష్మి, శాంత కుమారి, పద్మ, అల్లి శంకర్, తిరుపతి రెడ్డి, గోవర్ధన శాస్త్రి, కుంట సది, దామక పవన్, ప్రసాద్, సుంకరి సంతోష్, గఫూర్, అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News