Tuesday, 28 July 2026 06:22:13 AM

ప్రజలందరికీ సంతోషిమాత ఆశీస్సులు ఉండాలి..... కార్తీక శుక్రవారం మహిళలకు పవిత్రమైన రోజు...

బిజెపి రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి...

Date : 15 November 2024 04:44 PM Views : 607

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : పవిత్రమైన కార్తీకమాసం ప్రజలందరీ జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఒక్కరు ఒక సుఖసంతోషాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని బిజెపి రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి అన్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖని 8వ కాలనీలోని రాణి రుద్రమదేవి సెంటర్ నుండి సంతోషిమాత ఆలయం వరకు పెద్ద ఎత్తున ఓడి బియ్యం, దీప కాంతులతో ర్యాలీని నిర్వహించారు. అమ్మవారికి 180 ఘనంగా అభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంధ్యారాణి మాట్లాడుతూ... కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజు అంటే ఎంతో పవిత్రమైనదని పేర్కొన్నారు. కార్తీక మాసంలో ప్రతిరోజు పర్వదినము అని ప్రతిరోజు వెలిగించే దీపాలు ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. అలాగే కార్తీక మాసంతో సమానమైనటువంటి మాసం లేదని.ఈ మాసం మొత్తం దీపారాధనతో ప్రతి ఇల్లు సర్వా సుందరంగా ముస్తాబు అవుతుందన్నారు. సనాతన హిందూ ధర్మంలో పండుగల అన్నింటికీ మూల సూత్రం ఆరోగ్య ప్రాప్తి అని. ఆయా కాలాలకు అనుగుణమైన ఆచారాలను నిర్ణయించి, నిశ్చయించి, నిర్దేశించారన్నారు.సనాతన ధర్మంలో కార్తీక పౌర్ణమి శివుడు కేశవులకు పవిత్ర మైన పర్వదినం రోజు కావడంతో ఉసిరిని చెట్టు క్రింద దీపాలు పెట్టి పూజిస్తే సకల దేవతలను పూజించినట్టే, ఉసిరి కొమ్మతో స్నానం చేస్తే సర్వ రోగాలు హరిస్తాయని శాస్త్రలు చెబుతోన్నాయని పేర్కొన్నారు. ఈ చెట్టు నీడలో భూజిస్తే అది అమృతపాయమై దైవానుగ్రహం లభిస్తుందని ఔషధ గుణాలు ఎన్నో ఉన్న ఉసిరిలో అనేక వ్యాధులను తగ్గించే శక్తి ఉందని, ఉసిరి చెట్టు నుంచి వచ్చే చల్లని గాలి రోగ నిరోధక శక్తి పెంచుతుందన్నారు. కార్తీక పౌర్ణమి రోజు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందించే వనభోజనంలో సామాజిక సామరస్యం సమైక్యత సిద్ధిస్తుందన్నారు. విహారం వినోదం ఆనందం ఆహారం ఆరోగ్యం ఆధ్యాత్మికత అన్ని ఒకే చోట సమకూర ఏకైక వేడుకే ఈ కార్తీక వనభోజనం అని. ఈ కార్తీక పౌర్ణమి పండుగ మీ మీ జీవితంలో కాంతులు వెదజల్లాలని వేడుకున్నట్లు కందుల సంధ్యారాణి తెలిపారు. అనంతరం ఆలయ కమిటీ నిర్వాహకులు సదానందం, వసంతలు కందుల సంధ్యారాణికి ఘనంగా సన్మానం చేశారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :