Friday, 12 June 2026 01:38:02 AM

కాంగ్రెస్ పార్టీని బిసీలకు న్యాయం చేసేదాక వదిలిపేట్టం...మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

కాంగ్రెస్ కులగణన తప్పల తడక... కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసానికి కేరాఫ్ అడ్రస్

Date : 12 February 2025 05:22 PM Views : 700

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : బిసీలకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టేది లేదని, కులగణన పేరుతో తప్పుల తడకగా సర్వే నిర్వహించిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. ఈ మేరకు గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రంలోని బిసీలను అనగదొక్కెందుకే ముఖ్యమంత్రి రెవంత్ రెడ్డి కుట్రలు పన్నుతున్నాడని ఆరోపించారు. కులగణన పేరుతో సర్వే చేపట్టి అత్యధిక జనాభా కలిగిన బిసీలను తక్కువగా చూపిస్తుందని అయన మండిపడ్డారు.కులగణన సర్వే అంతా తప్పుల తడక అని కాంగ్రెస్ పార్టీ అంటేనే మెాసానికి కెరాఫ్ అడ్రస్ అని విమర్శించారు. సర్వేల పేరుతో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి ఓసీల జనాభాను పెంచారన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన సకల జనుల కుటుంబాల సర్వేకు ప్రస్తుతం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వేకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగనన సర్వేను ఆ పార్టీకి సంబంధించిన నేతలే తప్పుపడుతున్నారని, అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు రావడం లేదని విమర్శించారు.సర్వే పేరుతో బీసీ ఉపకులాల వర్గాలకు చేసిన అన్యాయంతో కాంగ్రెస్ పతనం ప్రారంభమైందని స్పష్టం చేశారు.కుల గణన సర్వేలో 5న్నర శాతం బీసీ జనాభా తగ్గించి దాదాపు 22 లక్షల మంది లేనట్టుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చూపించిందని అన్నారు.వెంటనే బీసీ వర్గాలను లక్షలాది సంఖ్యల్లో తగ్గించి చూపిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే బీసీలకు అసెంబ్లీలో ౩౪ పార్లమెంటులో 6 సీట్లు కేటాయించిందని గుర్తు చేశారు.కులగణన సర్వే జరిగిన తరువాత బీసీలు ఆందోళనకు గురవుతున్నారని కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కులగణన పూర్తిగా బీసీలకు అన్యాయం జరిగేలా ఉందన్నారు. గత ముఖ్యమంత్రి కేసీఆర్ కనీవినీ ఎరుగని రీతిలో 24 గంటల్లో సమగ్ర కుటుంబ సర్వే చేయించారన్నారు.ఇప్పటికైనా మల్లి రీ సర్వే నిర్వహించకుంటే బీసీల పక్షాన ఉద్యమం చేస్తామని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ హెచ్చరించారు.బీసీ కులాలు ఐక్యం కావలసిన అవసరం ఉందని పేర్కొన్నారు. కులగణనపై ఈ నెల 14 వ తేదీన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో నిర్వహించే బిసీ రౌండ్ టేబుల్ సమావేశంకు అందరూ హాజరుకావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ కులస్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గోపు ఐలయ్య యాదవ్, బొడ్డు రవీందర్, బోడ్డుపల్లి శ్రీనివాస్ నూతి తిరుపతి, అచ్చ వేణు, కల్వచర్ల కృష్ణవేణి,సట్టు శ్రీనివాస్ అల్లం అయులయ్య సంధ్యారెడ్డి, కోడి రామకృష్ణ,వెంకన్న కిరణ్ జీ , సారయ్య నాయక్ వెంకటేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

జేమ్స్ రెడ్డి , చీఫ్ ఎడిటర్

Reporter

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :