ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : ఏ ఎసీపీ గారు ఏం మాట్లాడుతున్నారు.? మీకు అర్థమైందా...? మీరు రౌడీ లెక్క చేయొద్దు... అంటూ ఓ కాంగ్రెస్ నేత పోలీస్ ఏసీపీని ముందుకు నెట్టి వేయడం సోషల్ మీడియాలో వీడియో వైరల్ గా మారింది... ఓ కార్పొరేటర్ స్థాయి వ్యక్తి కనీసం మర్యాద మరిచి ఒక ఏసీపీని ముందుకు నెట్టి వేయడం వెనక అర్థమేంటనే ప్రశ్నలు వెళ్లు వెతుతున్నాయి. కనీసం సదరు అధికారి స్థాయిని కూడా గుర్తించలేని నేత ప్రశ్నించడం వెనుక సోషల్ మీడియాలో హాస్యాస్పదంగా మారింది. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. మరి ఏసీపీని నెట్టివేసిన సదరు నేతపై పోలీసు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా..? లేదా అనేది తెలియాల్సి ఉంది... విధి నిర్వహణలో భాగంగా ఎవరు అసభ్యకరంగా మాట్లాడిన, పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన, ఎవరినైనా ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదంటూ గొప్ప గొప్ప వాక్యాలు చేస్తున్న ఉన్నతాధికారులు మరి దీనిపై ఏ విధంగా స్పందిస్తారు అనేది ప్రశ్నార్ధకంగా మారింది... అధికారం రాకముందు కేవలం కార్పొరేటర్ గా ఉన్న సదరు నేత గతంలో ఫైనాన్స్, చిట్టీల వ్యవహారంలో ఎంతో మందిని మోసం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరి ఇప్పుడు అధికారంలో ఉంటే అవి ఏమి వర్తించవా అనే ప్రశ్నలు వెలువెత్తుతున్నాయి. ఇప్పటికైనా దీనిపై ఉన్నతాధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...
Reporter
Aakanksha News