Tuesday, 28 July 2026 01:31:20 PM

ఆర్టివో కార్యాలయం ఎదుట లారీ డ్రైవర్ ఆందోళన...

లంచం అడిగిన అధికారులను సస్పెండ్ చేసే వరకు దిగేది లేదు...

Date : 15 February 2025 02:22 PM Views : 777

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / పెనుగొండ సతీష్ : ఆర్టీవో కార్యాలయం ఎదుట ఓ లారీ డ్రైవర్ తన లారీ పైకి ఎక్కి కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని ఆందోళన చేయడం పెద్దపల్లి జిల్లాలో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే... వసంత నగర్ కు చెందిన లారీ ఓనర్ అనిల్ గౌడ్ ను ప్రతినెల ఆర్టీవో అధికారులు మామూలు అడుగుతున్నారని ఇవ్వకపోతే అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఆందోళనకు దిగాడు. ఒక్కొక్క లారీ కి ప్రతినెల 8 వేల రూపాయలు లంచం వసూలు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఇప్పటి వరకు తాను అధికారులకు పంపించిన డబ్బులను తన ఫోన్ పే లో చూపిస్తూ ఇది ఎక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ లంచాల కోసం వేధింపులకు గురి చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకొని వారిని వెంటనే సస్పెండ్ చేయకపోతే కరెంటు తీగలు పట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని అనిల్ గౌడ్ తో మాట్లాడి కిందకి దింపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :