Tuesday, 28 July 2026 08:09:22 AM

జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులరైజ్ చేయాలి... ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలి..

సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి జ్యోతి

Date : 21 March 2025 05:20 PM Views : 443

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : కేంద్ర ప్రభుత్వ పథకమైన జాతీయ ఆరోగ్య మిషన్ పథకాన్ని రెగ్యులరైజ్ చేయాలని దీనిలో కీలక పాత్ర వహిస్తున్న ఆశా వర్కర్లకు కనీస వేతనాలు, పెన్షన్ సౌకర్యం కల్పించాలని, ఎన్ హెచ్ ఎం పరిష్కరించాలని ఆశ వర్కర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనీ మాతా శిశు ఆస్పత్రి ఎదుట ఆశా వర్కర్స్ ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి జ్యోతి మాట్లాడుతూ... కేంద్ర బడ్జెట్ లో జాతీయ ఆరోగ్య మిషన్ కు బడ్జెట్ కేటాయింపులు పెంచాలని పెండింగ్ లో ఉన్న కేంద్ర వాటాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు .కరోనా కాలంలో గ్లోబల్ లీడర్స్ గా ఆశ వర్కర్లు గుర్తించి వారి జీవన పరిస్థితులను మెరుగుపరచడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు.ఎన్ హెచ్ ఆర్ ఎం ప్రారంభం అయినప్పటి నుండి మాతృ శిశు మరణాలు నివారించడంలో ఆరోగ్య విద్యను మెరుగుపరచడంలో ఆశాల పాత్ర చాలా కీలకంగా ఉందని అనేక నివేదికలు చెప్తున్నాయని చట్టబద్ధ సౌకర్యాలు కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు . వారి శ్రమను గుర్తించి వారికి కనీస వేతనాలు నిర్ణయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :