Tuesday, 28 July 2026 07:14:14 AM

అంగన్వాడి సెంటర్లకు కొత్త భవనాల కోసం కృషి..

అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు నూతన డ్రెస్ కోడ్ వస్త్రాలు పంపిణి...పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు...

Date : 15 October 2025 11:40 AM Views : 498

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లి గ్రామంలోని తన నివాసంలో బుధవారం పెద్దపల్లి నియోజకవర్గంలోని 305 మంది అంగన్వాడి టీచర్లకు, ఆయాలకు నూతన డ్రెస్ కోడ్ వస్త్రాలను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. చాలా గ్రామాల్లో అంగన్వాడి భవనాల సమస్యలు ఉన్నాయని, సెంటర్లలో పిల్లలకు టీచర్లు, ఆయాలు అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఇంట్లో తల్లి తల్లితో సమానంగా వీరు పిల్లల పట్ల అంకితభావంతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. పిల్లలకు ఒకవైపు నర్సరీ విద్యను అందిస్తూనే మరోవైపు మంచి పోషకాలతో ఉన్న పదార్థాలను ప్రభుత్వం పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. ఆన్ లైన్ లో వివరాలను నమోదు చేస్తూ పూర్తి పారదర్శకంగా అంగన్వాడి సేవలను ప్రభుత్వం అందిస్తోందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కొత్త డ్రెస్ కోడ్ వస్త్రాలను అందించడం జరుగుతున్నదని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిడిపిఓ, అంగన్వాడి టీచర్లు, ఆయాలు తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :