Tuesday, 28 July 2026 06:25:13 AM

తభిత ఆశ్రమంలో వివాహ మహోత్సవం..

– మానవత్వాన్ని చాటిన కందుల సంధ్యారాణి

Date : 20 May 2025 08:26 PM Views : 913

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : తభిత ఆశ్రమం ఓ నిరుపేద మహిళ జీవితాన్ని మార్చి వేసింది. జనగామ జిల్లా రఘునాథ్‌పల్లి గ్రామానికి చెందిన రాజేష్‌తో ఆమెకు ఆశ్రమ నిర్వాహకులు వివాహాన్ని నిశ్చయించగా పెద్దపల్లిలోని శ్రీ వేంకటేశ్వర కళ్యాణమండపంలో ఇది ఘనంగా జరగింది.పుట్టిన ఇంటి ఒడిలో పెరుగకపోయినా, తల్లిదండ్రుల ఆశీర్వాదాలు లేకపోయినా… ఆశ్రమమే అమ్మచెయ్యిగా మారింది. వివాహ ఖర్చులన్నింటినీ భుజాన వేసుకుని, పెళ్లికూతురిగా మానసను అందంగా ముస్తాబు చేసింది. ఇది మామూలు పెళ్లి కాదు – ఓ జీవితానికి నూతన ఆరంభం. ఈ వేడుకలో బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇంచార్జీ కందుల సంధ్యారాణి ముఖ్య అతిథిగా హాజరై, మానసకు కొత్త వస్త్రాలు అందించి, తన ప్రేమాభివందనాలతో ఆశీర్వదించారు. అనంతరం కందుల సంధ్యారాణి మాట్లాడుతూ...ఈ సమాజంలో నిరుపేదలకు అండగా ఉండటమే నిజమైన సేవ. మానస భవిష్యత్తులో ఎటువంటి సహాయం అవసరమైనా, నేను ఉన్నాను” అని ఆమె హృదయపూర్వకంగా ప్రకటించారు.ఈ సందర్భంగా ఆశ్రమ నిర్వాహకులు, వివాహాన్ని నిర్వహించిన మిత్ర వర్గం, బంధుమిత్రులను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.మానవతా విలువలు మరుగున పడుతున్న ఈ కాలంలో – తభిత ఆశ్రమం, కందుల సంధ్యారాణి వంటి వ్యక్తులు చూపిన ప్రేమ, మానసకు ఇచ్చిన నూతన జీవనం – సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.నిరుపేదలకు అండగా ఉండటం ద్వారా మనిషిగా మనం చూపవలసిన బాధ్యతను నెరవేర్చగలమని . మానస తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్న సందర్భంగా, ఆమెకు నా ఆశీస్సులు తెలియజేస్తున్నానని భవిష్యత్తులో ఆమెకు అవసరమైన సాయం అందించేందుకు నేను సిద్ధంగా ఉంటానని కందుల సంధ్యారాణి తెలిపారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :