Monday, 27 July 2026 01:50:53 AM

అక్రమ వ్యాపారాలపై రౌండ్ టేబుల్ సమావేశం.

Date : 21 March 2025 04:44 PM Views : 454

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఇతర రాష్ట్రాల నుండి వచ్చి పెద్దపల్లిలో అక్రమంగా వ్యాపారాలు చేస్తున్న వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకునేలా కార్యాచరణ కోసం పెద్దపల్లి అమర్ చంద్ కళ్యాణ మండపంలో శుక్రవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. బొంకూరి.సురేందర్ సన్ని అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రంగాల కార్మికులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కుల, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని పలు తీర్మానాలు చేశారు. పెద్దపల్లిలో వ్యాపారాలు నిర్వహించే ఇతర రాష్ట్రాల వారు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ప్రతి వస్తువు ప్రభుత్వ నిబంధనల ప్రకారం అమ్మకం చేయాలని తీర్మానించారు. ప్రతి కొనుగోలుపై తప్పకుండా జీఎస్టీ బిల్లును ఇవ్వాలన్నారు. ఎప్రిల్ 13న మరోసారి రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో శిలారపు పర్వతాలు, కావేటి రాజ గోపాల్, మంద భాస్కర్ యాదవ్, గద్దల వినయ్ కుమార్, బొడ్డుపల్లి రామ్మూర్తి, కల్లెపల్లి రవి, కొండ సుధాకర్, సయ్యద్, జమీల్, నరసింహ, బొడ్డుపల్లి రమేష్, సందీపం సుదర్శన్, తబ్రెజ్, తాళ్ళపెళ్లి అంజయ్య, అరేపల్లి మానస్ కుమార్, చంద్రగిరి ఉదయ్, మాచర్ల రమేష్ , బొంకూరి హెవన్ కుమార్, కళ్ళేపల్లి విజయ్, కల్లెపల్లి సతీశ్, అలువాల రాజేందర్, వడ్లూరి నాగరాజు, పెండ్యాల సురేందర్, తూముల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :