ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / : ఈనెల 21న హైదరాబాద్ సీతాఫల్ మండి జిహెచ్ఎంసి ఫంక్షన్ హాల్లో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరగనున్న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ పోస్టర్లను పెద్దపల్లి, చెన్నూర్, రామగుండం శాసనసభ్యులు చింతకుంట విజయ రమణారావు, వివేక్ వెంకటస్వామి, మక్కాన్ సింగ్, ఎంపీ వంశీకృష్ణ సోమవారం ఆవిష్కరించారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమానికి తమ వంతు ప్రయత్నం చేస్తామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారులు ఫోరం రాష్ట్ర కన్వీనర్ గుండేటి ఐలయ్య యాదవ్ ఆద్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో మహిళల విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి రెడ్డి, నాయకులు నూనె రాజేశం, దెబ్బట చంద్రకళ, బింగు రాజు, మంద భాస్కర్ యాదవ్, లలిత ఠాగూర్, కందుల సదాశివ, సురేష్ గౌడ్, జునుగారు సుధాకర్, మూల మల్లేష్ గౌడ్, కలవల తిరుపతి, కన్నూరి ఆంజనేయులు, చింతల తిరుపతి, గుజ్జుల పద్మ, దేవ భారతి, ఖతిజా, సంకటి నరసమ్మ, కంకటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Admin
Aakanksha News