Wednesday, 29 July 2026 07:08:03 AM

నిధులు దుర్వినియోగం చేసిన వారిపై తీసుకోవాలి...

Date : 17 May 2025 10:12 PM Views : 551

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / మంథని : గోపాల్ పూర్ గ్రామపంచాయతీలో నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గోపాలపురం మాజీ ఎంపిటిసి, మాజీ సర్పంచి చందు రాజమల్లు ఒక ప్రకటనలో కోరారు. మంథని మండలం గోపాల్పూర్ గ్రామపంచాయతీలో అనేక అక్రమాలు అవినీతి పాల్పడి నిధులు దుర్వినియోగం జరిగిందని 2023 డిసెంబర్ 23న జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేశామన్నారు. సుమారు 12 నెలలు నుండి జిల్లా పంచాయతీ అధికారి పెద్దపెల్లి కాలయాపన చేశారన్నారు. డిఎల్పిఓ గత సంవత్సరం డిసెంబర్ 3న విచారణ చేపట్టి నిధులు దుర్వినియోగం జరిగాయని జిల్లా పంచాయతీ అధికారికి నివేదిక సమర్పించార న్నారు. కార్యదర్శులు 2019 నుంచి 2023 వరకు అక్రమాలకు పాల్పడి సుమారు రూ. 52.44 లక్షలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు. అవినీతి అక్రమానికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శులలో ఒకరిపై మాత్రమే చర్యలు తీసుకొని మిగితా వారిని సంబందిత అధికారులు కాపాడుతున్నారని, ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారి స్పందించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :