Tuesday, 28 July 2026 06:02:45 AM

సింగరేణి సీబీఎస్ఈ పాఠశాలను గోదావరిఖనిలోనే ఏర్పాటు చేయాలి...

టిఆర్ఎస్(డి) పార్టీ యూత్ స్టేట్ సెక్రటరీ జనరల్ ఈదునురి నర్సింగ్

Date : 18 April 2025 04:42 PM Views : 311

ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / గోదావరిఖని : గోదావరిఖని చుట్టుపక్కల ప్రాంతంలో కార్మికులు, కార్మికేతరులు, వివిధ వర్గాల కుటుంబాల పిల్లల సౌకర్యార్థం సింగరేణి సీబీఎస్ఈ పాఠశాలను గోదావరిఖనిలో ఏర్పాటు చేయాలనీ సింగరేణి సి అండ్ ఎండి బలరాం నాయక్ ను టిఆర్ఎస్(డి) పార్టీ యూత్ స్టేట్ సెక్రటరీ జనరల్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా విద్యార్థి విభాగం ఇంచార్జ్ ఈదునురి నర్సింగ్ కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ....సింగరేణి సంస్థ ద్వారా తక్కువ ఫీజుతో.. సెంట్రల్ సిలబస్ తో పాఠశాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను ఈ ప్రాంత పిల్లలకు అందించాలని లక్ష్యంగా సింగరేణి సంస్థ, స్వయంగా సెంట్రల్ సిలబస్ తో పాఠశాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయం అని అన్నారు. పాఠశాలను 8.ఇంక్లైన్ కాలని లో.. ఏర్పాటు చేస్తున్నందున గోదావరిఖనిలోనే అత్యధికంగా కార్మికులు, కార్మికేతరులు ఉన్నందున గోదావరిఖని ప్రాంతంలోనే సింగరేణి సీబీఎస్ఈ పాఠశాలను ఏర్పాటు చేయాలని సంస్థ సీ అండ్ ఎండి బలరాం నాయక్ గారిని విజ్ఞప్తి చేసారు.

PENAGONDA SATHISH, AKANKSHA NEWS EDITOR & CHAIRMAN

Admin

Aakanksha News

మరిన్ని వార్తలు

Copyright © Akanksha News 2026. All right Reserved.

Developed By :