ఆకాంక్ష న్యూస్ - పెద్దపల్లి జిల్లా / పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి పట్టణంలోని108 అంబులెన్స్ వాహనాన్ని జిల్లా కోఆర్డినేటర్ కుమారస్వామి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కుమారస్వామి మాట్లాడుతూ..అత్యవసర సమయంలో వినియోగించే పరికరాల పనితీరును, సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. గర్భిణీలు. రోడ్డు యాక్సిడెంట్లు, పాము కాటు వంటి అత్యవసర పరిస్థితుల్లోనూ 108 అంబులెన్సును మండల ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. తనిఖీ సమయంలో ఈఎంటీ నూనె దేవేందర్, పైలెట్ పవన్ తదితరులు ఉన్నారు.
Admin
Aakanksha News